: ఈడెన్ గార్డెన్స్ లో చతికిలబడిన సన్ రైజర్స్


భారీ టార్గెట్ కళ్ళ ముందు కదలాడుతుంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ భీతిల్లిపోయారు. రెండంకెల స్కోర్లు సాధించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమై కోల్ కతా నైట్ రైడర్స్ కు విజయాన్ని అప్పనంగా కట్టబెట్టారు. 48 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేశారు. ముఖ్యంగా కలిస్.. హైదరాబాద్ జట్టును తన జెంటిల్ మీడియం పేస్ తో ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లు విసిరిన ఈ సఫారీ ఆల్ రౌండర్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో ఓవర్లన్నీ ఆడినా లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిపోయింది సంగక్కర సేన.

  • Loading...

More Telugu News