: కేసీఆర్.. అప్పుడే రాజకీయాలా..!?: నారాయణ


ఎన్నికలకు చాలా సమయం ఉన్నా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అప్పుడే రాజకీయాలు మొదలెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తులు ఉండబోవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. నేడు మంచిర్యాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేకే, మందా వంటి నేతలతో కేసీఆర్ నేడు భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్ర క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణ అభిప్రాయపడ్డారు. అవినీతి కేసుల్లో నిందితులుగా ముద్ర పడిన మంత్రులను తొలగించి కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News