: ఆంగ్లంలో మాట్లాడలేదని పిల్లలపై టీచర్ వీరంగం


పాఠశాలలో ఆంగ్లంలోనే మాట్లాడాలని హుకుం జారీ చేసిన ఆ ఉపాధ్యాయురాలు, అందుకనుగుణంగా పిల్లలు మసలుకోకపోవడంతో వారిపై తన ప్రతాపాన్ని చూపింది. హైదరాబాదులోని ఎర్రగడ్డ మోతీనగర్ పరిధిలోని డాన్ బాస్కో పాఠశాలలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంగ్లంలో మాట్లాడని పిల్లలను చితకబాదడమే కాక 40 మంది పిల్లలను బయటకు పంపేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తలిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News