: కిరణ్ ఫొటోలపై తెలంగాణ డిప్యూటీ సీఎం చిందులు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలపై తెలంగాణ డిప్యూటీ సీఎం చిందులు తొక్కారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తాటికొండ రాజయ్య తన కంటబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలను చించేశారు. పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలిస్తున్న మంత్రికి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనైన రాజయ్య, ఆ ఫొటోలను స్వయంగా చించేశారు.

  • Loading...

More Telugu News