: ఏపీ రాజధాని కోసం కేంద్రానికి రెండు ఆప్షన్లు
రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే రెండు ప్రతిపాదనలను పంపినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆప్షన్లు ఏమిటంటే... 1. విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని, 2. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధాని. మరి, వీటిలో కేంద్రం దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.