: మాస్కోలో పట్టాలు తప్పిన మెట్రో రైలు, 19 మంది మృతి


మాస్కోలో మంగళవారం ఉదయం ఓ మెట్రో రైలు పట్టాలు తప్పింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా, 120 మంది దాకా గాయపడ్డారు. స్లావియాన్ స్కీ, పార్క్ పోబెడి స్టేషన్ల మధ్య సొరంగ మార్గంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని రష్యా అత్యవసర సేవల శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రమాదంలో ముందున్న రైలు బోగీల్లోకి వెనకున్న బోగీలు చొచ్చుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని ఆయన తెలిపారు. అయితే విద్యుత్ సరఫరా తక్కువ కావడంతోనే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News