: టీఆర్ఎస్ పార్టీలోకి నేనెందుకు వెళతాను?: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఖండించారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు... టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్నట్టు కొందరు అసత్య కథనాలు సృష్టించారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లవలసిన అవసరం తనకు ఏముందని వివేక్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి అనవసరమైన విషయాలపై కాకుండా తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అనవసరంగా తనపై లేనిపోని ప్రచారాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీకి తెలంగాణలో బలమైన క్యాడర్, ఓటుబ్యాంకు వున్నాయని... తాము తెలంగాణలో మరింత బలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన అన్నారు.