: ఈ నెల 17న పీసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం: పొన్నాల
పీసీసీ ప్రధాన కార్యదర్శుల సమీక్ష సమావేశం ఈ నెల 17న నిర్వహించనున్నట్లు తెలంగాణ పీీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కు తాను ప్రత్యామ్నాయం కాదన్నవారే ఇప్పుడు ప్రత్యామ్నాయం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన నైతిక స్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు. కాగా, జానారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం గురించి తనకు తెలియదన్నారు.