: అక్కడ మద్యం 24 గంటలూ దొరుకుతుంది!


విశాఖ జిల్లాలోని మద్యం షాపుల్లో అక్రమ అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయి. లైసెన్స్ ప్రక్రియ పూర్తయినా, జిల్లాలో 90 శాతం మద్యం షాపులు పాతవారి చేతుల్లోనే ఉన్నాయి. నిబంధనల మేరకు ఉదయం 10.30 నుంచి రాత్రి 10.30 వరకు మాత్రమే విక్రయించాలని ఉన్నా... అవేమీ మద్యం వ్యాపారులకు పట్టడం లేదు. అక్కడ 24 గంటలూ మద్యం దొరుకుతుంది. అయితే, మద్యాన్ని ఎంఆర్పీ రేటు కన్నా 10 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ మందుబాబుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News