: టీటీడీ చైర్మన్ పదవి కోసం టీడీపీ లో తీవ్రమైన పోటీ


తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం టీడీపీ అగ్రనాయకుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులు టీటీడీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ రేసులో చదలవాడ కృష్ణమూర్తి అందరికన్నా ముందున్నట్టు సమాచారం. చదలవాడకు టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాలక మండలి సభ్యులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి, తిరుపతికి చెందిన టీడీపీ నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం పేర్లు వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్ కనుమూరి బాపిరాజు పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీ తో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News