: వైదిక్ కు ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదు: రాం మాధవ్
తీవ్రవాది హఫీజ్ సయీద్ ను కలిసిన సీనియర్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ ఆర్ఎస్ఎస్ మనిషేనంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించడాన్ని ఇటీవల బీజేపీలో చేరిన రాం మాధవ్ ఖండించారు. ఆర్ఎస్ఎస్ తో వైదిక్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అటు తనకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను పాత్రికేయుడు వైదిక్ కూడా కొట్టిపారేశారు. ఏమి ఆశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టు ద్వారా తాను హఫీజ్ సయీద్ ను కలిసినట్లు ఆయన తెలిపారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ తనను తానే అవివేకిగా చూపుకుంటోందన్నారు.