: ఫీజు రీయింబర్స్ మెంట్ పై రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని చర్చించాలి: సీపీఐ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, ఫీజు రీయింబర్స్ మెంట్ పై నెలకొన్న సందిగ్ధతపై సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కౌన్సెలింగ్ ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోతారని ఆ పార్టీ నేత రామకృష్ణ అన్నారు. అటు బోధనారుసుంపైనా ఎలాంటి స్పష్టత రాకపోవడం సరికాదన్నారు. ఈ రెండు అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఏ పార్టీ పోలవరానికి వ్యతిరేకం కాదనీ, ముంపు బాధితుల విషయంలోనే కొంత ఆందోళన ఉందని చెప్పారు. అయితే, పోలవరం నిర్వాసితులకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.