: కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్... హమాస్ డౌటే
రక్తమోడుతున్న గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఈజిప్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. ఈజిప్టు ప్రతిపాదించిన అంశాలకు షరతులతో కూడిన ఆమోదాన్ని ఇజ్రాయెల్ తెలిపింది. కాల్పుల విరమణకు సిద్ధమని వెల్లడించింది. అయితే ఈజిప్టు ప్రతిపాదనకు పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ 'హమాస్' ఎంతవరకు స్పందించిందనే విషయం మాత్రం అనుమానాస్పదంగా ఉంది.