: 'పటౌడీ ట్రోఫీ' ప్రజెంటేషన్ కార్యక్రమానికి షర్మిలా ఠాగూర్ కు ఆహ్వానం
దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ట్రోఫీ కోసం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతి ఏడాది టెస్టు మ్యాచ్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండులోని ఓవల్ లో ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదవ టెస్ట్ (చివరి) మ్యాచ్ జరుగనుంది. అనంతరం నిర్వహించే ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమానికి రావాలంటూ పటౌడీ భార్య, బాలీవుడ్ మాజీ నటి షర్మిలా ఠాగూర్ కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ బోర్డు (ఈసీబీ) ఆహ్వానం పంపింది. దీనిపై షర్మిల మాట్లాడుతూ, ఈసీబీ నుంచి తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ కు త్వరలో యూకే వెళ్లనున్నట్లు చెప్పారు.