: తెలంగాణ కోసం దేనికైనా రెడీ: కేకే
మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావుతో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు భేటీ అవడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు గంటపాటు సాగిన వీరి సమావేశం ముగిసింది. అనంతరం కేకే తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం అన్నిపార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంతకుముందే కేకే రెండ్రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాటలు పలు ఊహాగానాలకు కారణమవుతున్నాయి. కాగా, కేసీఆర్ తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని, అందరూ టీఆర్ఎస్ లోకి వస్తే తెలంగాణ వాదానికి ఎక్కువ ప్రాచుర్యం లభిస్తుందన్నది ఆయన ఆలోచన అని కేకే వివరణ ఇచ్చారు.