: ఏ అవార్డూ నన్ను ఓదార్చలేదిక: మెస్సీ
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నేపథ్యంలో తనను ఏ అవార్డూ ఓదార్చలేదని అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీ అంటున్నాడు. అర్జెంటీనా ప్రజల కోసం కప్ గెలవాలనుకున్నానని, ఇప్పుడు ఏ బహుమతి గురించి పట్టించుకోబోనని, అసలేదీ తనకు అవసరం లేదని, ప్రస్తుతం తనను ఏదీ ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జర్మనీతో ఫైనల్లో మూడు ఛాన్సులు మిస్ చేసుకున్నామని మెస్సీ తెలిపాడు. అందులో ఒకటి తాను వృథా చేశానని చెప్పాడు. కాగా, వరల్డ్ కప్ లో నాలుగు గోల్స్ చేసిన మెస్సీకి ఫిఫా 'గోల్డెన్ బాల్' ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. మెస్సీకి అవార్డుపై మాజీ ఆటగాడు మారడోనా మండిపడుతూ, అతడు ఆ పురస్కారానికి అనర్హుడని విమర్శించాడు.