: హైదరాబాదులో కేఎల్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
హైదరాబాదులోని అమీర్ పేటలో నిర్వహించిన ప్రముఖ ఇంజినీర్ కేఎల్ రావు జయంతి వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇకనుంచి కేఎల్ రావు జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తామని బాబు అన్నారు. అవినీతిని కేఎల్ రావు ఉపేక్షించేవారు కాదని, నదుల అనుసంధానంపై ఆయన ఆలోచనలు పలుమార్లు తెరపైకి వచ్చాయనీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కరవును పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందన్న సీఎం, వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో కరవు నిర్మూలనపై ఇంజినీర్లు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు.