: అశోక్ ఖేమ్కాకు పోస్టు దక్కినట్లే!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పాల్పడినట్లుగా భావిస్తున్న భూ కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు మోడీ సర్కారు రెడ్ కార్పెట్ పరిచేందుకు రంగం సిద్ధం చేసింది. వాద్రా భూ కుంభకోణాలను బయటకు తెచ్చిన ఖేమ్కాపై హర్యానా సర్కారు కేసులు నమోదు చేయగా, మోడీ సర్కారు మాత్రం ఏకంగా కేంద్రంలోనే పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధపడింది. కొద్ది రోజుల్లోనే ఖేమ్కా, కేంద్రం ప్రభుత్వంలో కీలక విభాగంలో పనిచేసే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.