: యూపీలో మహిళా కమిషన్ బడ్జెట్ కు కోత!


మహిళలపై అత్యాచారాల విషయంలో అపకీర్తి మూటగట్టుకున్న ఉత్తర ప్రదేశ్ సర్కారు, మహిళలకు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టకపోగా, మహిళలకు న్యాయం అందేలా కృషి చేస్తున్న మహిళా కమిషన్ బడ్జెట్ ను క్రమేణా తగ్గించేస్తోంది. 2011-12లో మహిళా కమిషన్ కు రూ. 5.10 కోట్లు కేటాయించిన యూపీ సర్కారు అందులో రూ. 4.16 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇక 2013-14కు వచ్చేసరికి మహిళా కమిషన్ కు కేటాయించింది కేవలం రూ. 75 లక్షలు మాత్రమే. ఇదిలా ఉంటే, తనకిచ్చిన నిధులనైనా మహిళా కమిషన్ సద్వినియోగం చేసుకుంటుందా అంటే, అదీ లేదు. 2011-12లో సర్కారు నుంచి రూ. 4.16 కోట్లు అందితే, అందులో రూ.26 లక్షలను ఖర్చు చేయకుండానే మిగిల్చేసింది. రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన అంశాలకు ఏ మేర నిధులు కేటాయిస్తున్నారన్న అంశంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా, ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • Loading...

More Telugu News