: రైతు రుణాల రీషెడ్యూల్ కాదు... రుణాలు మాఫీ చేస్తాం: మంత్రి కేటీఆర్


రైతు రుణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంటున్నారు. రుణాల రీషెడ్యూల్ కాదని, ఏకంగా రుణాలే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగిన ఫైనాన్షియల్ సెక్టార్ కాన్ క్లేవ్ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. దేశ రెండో రాజధానిగా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News