: ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధిని విశాఖ నుంచే ప్రారంభిస్తాం: మంత్రి పల్లె


విశాఖలోని మధురవాడ, రిషికొండ ఐటీ సెజ్ లను ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ రోజు పరిశీలించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధిని విశాఖ నుంచే మొదలుపెడతామని చెప్పారు. విశాఖలో ఐటీ పరిశ్రమకోసం 330 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఐటీ కంపెనీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని వివరించారు. విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్న మంత్రి రిషికొండ ఐటీ సెజ్ ను డీనోటిఫై చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News