: టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం పాస్ పోర్టు కొట్టేసిన దొంగలు


ఏకంగా మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం పాస్ పోర్టునే కొట్టేశారు దొంగలు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. కారులో కూర్చున్న ఆయన డ్రైవర్ కు మస్కా కొట్టిన దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, రోడ్డుమీద పది రూపాయల నోటు పడుందని ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ శ్రీనుకు చెప్పారు. దీంతో శ్రీను కారు నుంచి కిందకు దిగాడు. ఇదే సమయంలో దొంగల్లో ఒకడు కారు వెనుక డోర్ తెరిచి బ్యాక్ సీట్లో ఉన్న సూట్ కేసును తీసుకుని పారిపోయాడు. వారిని పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సూట్ కేసులో మందా పాస్ పోర్టు, రూ. 90 వేల నగదు, కొన్ని ఫైళ్లు ఉన్నాయి. జరిగిన ఘటనపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది స్థానిక దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News