: భారీ వర్షాలతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ సర్కారు అప్రమత్తమైంది. జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన సర్కారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గతేడాది భారీ వర్షాలతో ముంచెత్తిన వరదల నేఫథ్యంలో కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన వేలాది మంది మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పటిదాకా కేదార్ నాథ్ యాత్రకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఆయన పేర్కొన్నారు.