: న్యాయం కోసం ఫేస్ బుక్ ఎక్కిన యూపీ మహిళా ఎస్సై


యూపీ పోలీసు శాఖలో మరో దుమారం రేగింది. పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిపై డీఐజీ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై తన సీనియర్లకు ఫిర్యాదు చేయబోతే, వారు దీనిని పెడచెవిన పెట్టారు. దీంతో దిక్కుతోచని ఆ ఎస్సై, న్యాయం కోసం ఫేస్ బుక్ ను ఆశ్రయించక తప్పలేదు. శిక్షణలో తన బ్యాచ్ లోనే టాపర్ గా నిలిచిన ఆమె, ఫేస్ బుక్ లో తన సమస్యను ప్రస్తావించగానే వేల మంది ఆమెకు బాసటగా నిలిచారు. ’నా సహచర ఉద్యోగులే నా పిర్యాదును స్వీకరించని నేపథ్యంలో ఫేస్ బుక్ ను ఆశ్రయించడం మినహా నాకు మరే మార్గం కనిపించలేదు' అంటూ మీరట్ సమీపంలోని ఓ పోలీస్ అకాడెమీలో సైబర్ క్రైం విషయాలను బోధిస్తున్న ఆమె పేర్కొన్నారు. ’సొంత శాఖ ఉద్యోగినిపైనే అఘాయిత్యాలకు తెర తీస్తున్న యూపీ పోలీసుల నుంచి ఇంకేం ఆశిస్తాం?‘ అంటూ ఫేస్ బుక్ లో ఆమెకు వేలాది మద్దతు పలుకుతున్నారు.

  • Loading...

More Telugu News