: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు మృతి
పాలస్తీనా భూభాగంలోని గాజాపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. మరో పది మంది దాకా గాయపడ్డారు. గడచిన వారం రోజులుగా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ 'ప్రొటెక్టివ్ ఎడ్జ్' పేరిట ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న ఈ దాడుల్లో ఇప్పటిదాకా 178 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 35 మంది చిన్నారులు, 28 మంది మహిళలున్నారు. ఈ దాడుల్లో 1,290 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.