: జిన్ పింగ్ తో అనేక విషయాలు చర్చించా: మోడీ


బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ భేటీ అయ్యారు. వీరిరువురూ భేటీ కావడం ఇదే ప్రథమం. ఈ సమావేశంలో భారత్-చైనా సరిహద్దు అంశంపైనే మోడీ ప్రధానంగా దృష్టి సారించారు. సరిహద్దులో శాంతి సామరస్యాలకు పెద్దపీట వేయాలని వీరు నిర్ణయించారు. అంతే కాకుండా, సరిహద్దు సమస్యకు మెరుగైన పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు, రానున్న కాలంలో అంతర్జాతీయ వేదికలపై భారత్, చైనా కలసి పనిచేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సమావేశం అనంతరం, భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో మోడీ పోస్ట్ చేశారు. "చైనా అధ్యక్షుడితో నా సమావేశం ఫలవంతంగా ముగిసింది. ఇద్దరం అనేక సమస్యలపై చర్చించాం" అని ట్విట్టర్లో తెలిపారు.

  • Loading...

More Telugu News