: పోలవరాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తారట!


ఏపీ మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయి. మొన్నటికి మొన్న లోక్ సభలో పోలవరం బిల్లుకి ఆమోదం లభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదాన్ని పురస్కరించుకుని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కూడా మూడేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పోలవరం లాంటి భారీ బహుళార్థక ప్రాజెక్టుని మూడంటే మూడేళ్లలో ఎలా పూర్తి చెయ్యగలరో తమకు సైతం అర్థంకావట్లేదని సాగునీటి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మంత్రులన్నట్టు మూడేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తే అద్భుతం జరిగినట్లే అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News