: సమ్మె సైరన్ మోగిస్తోన్న పెట్రో డీలర్ల సంఘం
రాష్ట్రంలో పెట్రో డీలర్ల సంఘం సమ్మెకు సిద్ధమవుతోంది. దేశంలోని అతిపెద్ద చముర రంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీలు తమ పట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏపీ పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఐదు శాతం పన్నును ఆయా పెట్రో సంస్థలే భరించాలని డీలర్ల సంఘం కోరింది.