: పోలవరంపై మా అభ్యంతరాల మాటేమిటి?: బీజేడీ
పోలవరం నిర్మాణంపై ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం స్పందించకపోవడం దారుణమని బిజూ జనతా దళ్ (బీజేడీ) సోమవారం పార్లమెంటులో ఆవేదన వ్యక్తం చేసింది. పోలవరం వల్ల ఒడిశాలోని నాలుగు జిల్లాలకు చెందిన గిరిజనులు ప్రభావితం కానున్నారని సోమవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో గొంతుచించుకున్నా, కేంద్రం తమ వాదనను అసలు పట్టించుకోలేదని పార్టీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఇవాళ పార్లమెంట్ వెలుపల మీడియాకు చెప్పారు. పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించిన ప్రాజెక్టుగానే కేంద్రం భావిస్తోందని, అయితే, ఆ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోని గిరిజనులు కూడా ప్రభావితం కానున్నారన్న విషయాన్ని విస్మరిస్తోందని ఆయన అన్నారు.