: పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది: హోంమంత్రి రాజ్ నాథ్


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్... రాష్ట్రపతి సిఫారసు మేరకు బిల్లు ప్రవేశపెట్టామని చెప్పారు. ఆర్డినెన్స్ ఎప్పుడో రావాల్సింది కానీ, ఏపీలో రాష్ట్రపతి పాలన అమలులో ఉందని ఆయన అన్నారు. ఆర్డినెన్స్ ను గత ప్రభుత్వమే సిద్ధం చేసినా, ఆ సమయానికి రెండు రాష్ట్రాలు ఏర్పడలేదన్నారు. పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తుందని హోంమంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలను అధ్యయనం చేశానని రాజ్ నాథ్ చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు దేని గురించి ఆందోళన చెందుతున్నారో తమకు తెలుసునని ఆయన అన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల పట్ల తమకు బాధ్యత ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును అనేక దశాబ్దాల క్రితమే డిజైన్ చేశారని ఆయన చెప్పారు. పునరావాసం, పరిహారం విషయంలో ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడతామని హోంమంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News