: భారత్ పార్లమెంట్ లో రభస సిగ్గుచేటు: సయీద్
తనతో భారత్ విలేకరి వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ విషయంపై భారత పార్లమెంట్ లో రభస జరగడం సిగ్గుచేటని జమాత్ -ఉద్- దవా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నాడు. ’విశాల భావంతో నాతో కలిసేందుకు వచ్చే ప్రతి ఒక్కరితో భేటీ కావడం నా ధర్మం. ఇందులో తప్పేముంది? దీనిపై భారత పార్లమెంట్ లో రభస జరగడం సిగ్గుచేటు‘ అంటూ సయీద్ తన ట్వట్టర్ పేజీలో వ్యాఖ్యానించాడు. ఈ తరహా చర్యల ద్వారా భారత్ తన సంకుచిత తత్వాన్ని మరోసారి చాటుకుందని కూడా సయీద్ అన్నాడు. లౌకిక వాదినంటూ చెప్పుకునే భారత్, ఈ విషయంలో ఎందుకంత రాద్దాంతం చేస్తుందో అర్థం కావడం లేదని అతడు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ కు మోడి వస్తే, మీరెలా స్పందిస్తారంటూ, వైదిక్ తనను ప్రశ్నించాడని, అయితే రాజకీయ అంశాలపై తాను స్పందించనని కూడా చెప్పినట్లు సయీద్ ట్విట్టర్ లో రాశాడు.