: గిరిజనులకు వారి సొంత ప్రదేశంలోనే పునరావాసం కల్పించాలి: జేడీ శీలం


పోలవరంపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ... కొత్తగా ఏ గ్రామాలనూ ఏపీలో కలపలేదన్నారు. గిరిజనులకు వారి సొంత ప్రదేశంలోనే పునరావాసం కల్పించాలని ఆయన కోరారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అదే రాష్ట్రంలో పునరావాసం కల్పించాలన్నారు. ఈ మేరకు బిల్లులో సవరణ చేయాల్సిన అవసరం ఉందని జేడీ శీలం అన్నారు. జేడీ శీలం మాట్లాడుతుండగా వీహెచ్ అడ్డు తగలడంతో... జేడీ శీలం, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. వారిద్దరికీ జైరాం రమేశ్ సర్ది చెప్పడంతో శీలం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News