: గిరిజనుల హక్కులను కాపాడాలి: ఎం.ఏ ఖాన్
గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ. ఖాన్ అన్నారు. భద్రాచలం రామాలయాన్ని ముంచి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. అనంతరం రామదాస్ అత్వాలే మాట్లాడుతూ... నాలుగు రాష్ట్రాలతో మాట్లాడి కేంద్రం సమస్యను పరిష్కరించాలని కోరారు.