: పోలవరం నిర్మాణం రాజ్యాంగ విరుద్ధం: ఎంపీ పాల్వాయి


ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్ ఆర్థర్ కాటన్ పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చెప్పారన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించి, ఆ తర్వాత పోలవరాన్ని చేపట్టాలని నిపుణులు సూచించారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. ఈ అంశంలో రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా బిల్లు ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత డిజైన్ ను మార్చి 3 బ్యారేజీలను నిర్మించాలని పాల్వాయి అన్నారు. గిరిజనుల తరఫున 20 ఏళ్లుగా పోరాడుతున్నానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News