: ఐదు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు: కేంద్రం


బీహార్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎక్కువమంది ప్రజలు ఇప్పటికీ మరుగుదొడ్లు ఉపయోగించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ వారి ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ అవగాహన లేకపోవడంవల్ల వాటిని ఉపయోగించడం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వా రాజ్యసభలో పైవిషయాలు తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు టాయిలెట్స్ సదుపాయం కూడా లేదని చెప్పారు. అంతేగాక మహిళలు, బాలికలకు టాయిలెట్ సదుపాయం అంశం ప్రత్యేక పరిశీలనలో కూడా లేదన్నారు. ఈ క్రమంలో సొంతంగా టాయిలెట్లు నిర్మించుకునే శక్తిలేని ఆ రాష్ట్రాల్లోని చాలామంది బహిరంగ ప్రదేశాల్లోకి వెళుతున్నారని లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News