: గిరిజనులకు న్యాయం చేయాలి: ఎంపీ రేణుకా చౌదరి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ అంశంలో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనగా ఉన్నారని ఒడిశా ఎంపీ మహాపాత్ర తెలిపారు. అనంతరం ఎంపీ రేణుకా చౌదరి బిల్లుపై మాట్లాడారు. గిరిజనుల అభిప్రాయాలు తీసుకోవాలని రేణుకా చౌదరి అన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. భద్రాచలం గుడిని తెలంగాణలోనే ఉంచి, గుడికి చెందిన 900 ఎకరాలను ఏపీకి కేటాయిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు 1.89 లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని ఆమె చెప్పారు. ప్రాజెక్టు వల్ల 205 గ్రామాలు మునిగిపోతాయన్నారు. ముంపు బాధితులకు పూర్తిగా న్యాయం చేయాలని ఆమె కోరారు.