: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు, కానీ..!: కేసీ త్యాగి
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి అన్నారు. అయితే, బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించినా పట్టించుకోలేదన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... విభజన సమయంలో రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరముందని అన్నారు. ఎన్డీయే సమావేశం నిర్వహించి ఇతర రాష్ట్రాల డిమాండ్లపై కూడా చర్చించాలని ఆయన అన్నారు.