: నాలుగు లక్షల మంది ఆందోళనను కేంద్ర హోంమంత్రి అర్థం చేసుకోవాలి: ఎంపీ రాపోలు
నాలుగు లక్షల మంది ఆందోళనను కేంద్ర హోంమంత్రి అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లుపై ఆయన మాట్లాడుతూ... ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఆందోళనతో గిరిజనులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని రాపోలు చెప్పారు. పోలవరం నిర్మించడం వల్ల లాభాల కన్నా, నష్టాలే ఎక్కువని పలు నివేదికలు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పోలవరం కట్టి రాజమండ్రి నగరాన్ని ముంచుతారా? ఆయన రాపోలు ప్రశ్నించారు.