: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించిన టీ విద్యార్థులు
పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా సోమవారం తెలంగాణ విద్యార్థులు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ముట్టడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులు ఒకానొక దశలో కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.