: వేగంగా పావులు కదుపుతోన్న మందా


కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం వేగంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ చదరంగంలో ఎప్పుడు వెయ్యాల్సిన ఎత్తు అప్పుడెయ్యకపోతే అధోగతే అన్న నానుడిని ఆయన బాగా వంటబట్టించుకున్నట్టుంది! తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యమంటూ నిన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిసిన మందా, నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కే. కేశవరావు, జానా రెడ్డిలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం కేకే నివాసంలో వీరు ముగ్గరూ భేటీ అయినట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఇవ్వకపోతే తనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు పార్టీని వీడుతారని హెచ్చరించిన మందా.. నేడు కేకే నివాసానికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. పనిలో పనిగా మందా.. మంత్రి డీకే అరుణపై నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ లో పార్టీ దుస్థితికి ఆమే కారణమని ఆయన ఆరోపించారు. తనకు నీతులు చెప్పే స్థాయి అరుణకు లేదని మందా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News