: అక్కడ దాడులు... ఇక్కడ నిరసనలు


గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్లో నిరసన వ్యక్తమైంది. శ్రీనగర్లో పదులసంఖ్యలో విద్యార్థులు వీధుల్లోకొచ్చి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్ ఎన్ క్లేవ్ వద్ద గుమికూడిన ఈ విద్యార్థులు ఇస్లాం, పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ అరాచకాలు నశించాలని ఎలుగెత్తారు. "పాలస్తీనా సోదరులారా, మేం మీతో ఉన్నాం" అని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అయితే, విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు జోక్యం చేసుకోలేదు.

  • Loading...

More Telugu News