: వాహనాల నిబంధనల్లో మార్పులు అవసరం: గడ్కరీ
దేశంలోని వాహనాల నిబంధనల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ’ప్రధానంగా కార్లలో సాధ్యమైనంత మేర బయో ఇంధనాన్ని వినియోగించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తాం. మార్పులు తీసుకొచ్చే ముందు అమెరికా, కెనడా, బ్రెజిల్ తదితర దేశాలు అవలంబిస్తున్న విధానాలను పరిశీలిస్తాం‘ అని చెప్పారు.