: ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సై అంటోన్న బాబు
ఎస్సీ ఎస్టీలకు మేలు చేకూర్చే సబ్ ప్లాన్ కావాలని కోరింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే, ఆ గొప్పంతా తమదే అని కాంగ్రెస్ సర్కారు చాటుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం బాబు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలోని శృంగవరం వద్ద ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్ళించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళే లేకుండాపోయాయని బాబు దుయ్యబట్టారు.