: ఎర్రచందనం వేలానికి ఏపీకి కేంద్రం అనుమతి
అటవీశాఖ వద్ద ఉన్న 8,584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ వివరాలను ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివరించారు. 15 రోజుల్లోగా ఎర్రచందనం నిల్వల విక్రయానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. తొలుత 4000 టన్నులు ఎర్రచందనాన్ని వేలం వేయనున్నట్టు వెల్లడించారు.