: విలేకరిగా మాత్రమే కలిశా: సయీద్ తో భేటీపై వేద్ వివరణ


లష్కరే- తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ను విలేకరిగా మాత్రమే కలిశానని రామ్ దేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ చెప్పారు. సయీద్ తో తన భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని ఆయన సోమవారం విలేకరులకు వివరించారు. పాకిస్తాన్ లో సయీద్ తో వేద్ ప్రతాప్ భేటీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో సోమవారం రాజ్యసభ లో కాంగ్రెస్ సభ్యులు సభను అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేద్ ఈ వివరణను ఇచ్చారు.

  • Loading...

More Telugu News