: సురక్షిత ప్రాంతాలకు గాజా వాసులు... ఇజ్రాయెల్ దాడుల ఫలితం


హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు నేడు భూతలానికి కూడా విస్తరించాయి. ఈ క్రమంలో ఉత్తర గాజా ప్రాంతం నుంచి వేలాది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తెల్ల జెండాలు ఊపుతూ, వారు తమ సామాన్లతో ఐక్యరాజ్యసమితి షెల్టర్లకు పయనమవుతున్నారు. గత కొన్నిరోజులుగా హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో దాడులు చేస్తుండగా, ప్రతిగా ఇజ్రాయెల్ క్షిపణి, వైమానిక దాడులతో భీకరంగా విరుచుకుపడుతోంది. దీంతో, ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినవారి సంఖ్య 170కి చేరింది. తాజాగా, ఇజ్రాయెల్ భూతల దాడులకు ఉపక్రమించింది. ఈ క్రమంలో గాజా వాసులకు స్పష్టమైన హెచ్చరికలు పంపింది. దాడుల తీవ్రత నేపథ్యంలో పౌరులు ఇళ్ళ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిందిగా సూచించింది.

  • Loading...

More Telugu News