: అలవెన్సుల కోసం కేటీపీఎస్ కార్మికుల ఆందోళన


గ్రిడ్ అలవెన్సు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కేటీపీఎస్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా గ్రిడ్ అలవెన్సులను చెల్లించకుండానే కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపిస్తూ కేటీపీఎస్ లోని అన్ని కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తి సగం మేర పడిపోయింది. కార్మికుల ఆందోళన నేపథ్యంలో వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా, కేవలం 600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

  • Loading...

More Telugu News