: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువుకు 10లక్షల గ్రాంట్: సీఎం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరం ప్రకటించారు. విదేశాలలో చదువుకునేందుకు 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దీనికితోడు అదనంగా మరో 5లక్షల రూపాయల మేర బ్యాంక్ లోన్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.