: జంతర్ మంతర్ వద్ద పోలవరంకు వ్యతిరేకంగా ఆందోళన
పోలవరం ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి టీజేఏసీ, టీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు. పోలవరం ప్రాజెక్టుతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని... అందువల్ల పోలవరం నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పలువురు నేతలు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లును అడ్డుకోవడానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని సూచించారు.