: కేసీఆర్ తో సుదీర్ఘ భేటీపై మందా వివరణ
టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో నిన్న సాయంత్రం మూడు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ అయిన కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం.. నేడు వివరణ ఇచ్చారు. కేవలం ఎంపీ హోదాలో ఆయన్ను కలిశానని చెప్పుకొచ్చారు. ఇక గులాబీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అంటూ ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో మందాకు వివరణ ఇవ్వక తప్పిందికాదు. కేసీఆరే తనను ఆహ్వానించారని తెలిపారు. పార్టీని వీడతానని తాను ఎవరికీ చెప్పలేదని మందా అన్నారు. కాగా,కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందంటూనే, తెలంగాణ ప్రకటించకపోతే తాను, మరో ఇద్దరు ఎంపీలు పార్టీకి దూరమవుతామని స్పష్టం చేశారు మందా.